
ఆగిరిపల్లిలో అక్రమ క్వారీని అడ్డుకున్న స్థానికులు
ఆగిరిపల్లి మండలం నరసింగపాలెం లో యదేచ్చగా సాగుతున్న అక్రమ క్వారీ తవ్వకాలను స్థానికులు శుక్రవారం అడ్డుకున్నారు. అక్రమ క్వారీకి తరలిస్తున్న ఏడు భారీ వాహనాలను, జెసిబిని గ్రామస్తులు నిలిపివేశారు. కొండపై అనుమతులు లేకుండా క్వారీ నడుపుతున్నారని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.