ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు
టి.నరసాపురం మండలం,తిరుమల దేవిపేట గ్రామ పంచాయతీ మధ్యాహ్నపువారిగూడెం గ్రామంలో పద్మవిభూ షణ్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈవేడుకలలో కేక్ కటింగ్ చేసి, బాణాసంచా కాల్చి చిరంజీవి అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుని మిఠాయిలు ప్రజలకు పంచారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడపా నాగరాజు, జనసేన పార్టీ నాయకులు, మెగా అభిమానులు పాల్గొన్నారు.