
జీలుగుమిల్లి: ఎమ్మెల్యే న్యూ క్యాంపు కార్యాలయం ప్రారంభం
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నూతన క్యాంపు కార్యాలయాన్ని జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఎల్లప్పుడూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు.