విడాకుల కేసుల్లో మనోవర్తిని నిర్ణయించేందుకు సుప్రీం సూచనలు
విడాకుల ఉదంతాలు పెరుగుతున్న కొద్దీ మనోవర్తి చర్చనీయాంశమవుతోంది. దీంతో విడాకుల కేసుల్లో మనోవర్తిని నిర్ణయించేందుకు సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. భార్యభర్తల ఆర్థిక, సామాజిక హోదా పరిశీలన, భవిష్యత్తులో భార్య, పిల్లల అవసరాల పరిశీలన, భార్యాభర్తలిద్దరి విద్యార్హతలు, ఉద్యోగ వివరాల పరిశీలన, దంపతుల ఆస్తిపాస్తుల వివరాలు మనోవర్తి నిర్ణయంలో తోడ్పడతాయని సుప్రీంకోర్టు తెలిపింది.