రూమర్స్‌పై హీరోయిన్ సాయిపల్లవి ఘాటుగా స్పందించారు. నిరాధారమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. తన మౌనాన్ని అవకాశంగా తీసుకోవద్దని ట్వీట్ చేశారు. కాగా 'రామాయణ' మూవీలో సీత పాత్ర చేసేందుకు సాయిపల్లవి తన అలవాట్లు, పద్ధతులు మార్చుకున్నారంటూ ఓ తమిళ వెబ్సైట్ కథనాలు ప్రచురించింది. దీంతో సాయి పల్లవి ఈ విధంగా స్పందించారు.