మంచు ఫ్యామిలీలో గొడవలు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ మరో పోస్ట్ చేశారు. 'ఈ లోకంలో ఏదీ మనది కానప్పుడు, ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు' అంటూ ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టారనే దానిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా, నిన్న కూడా తన కూతురుతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ..'పీస్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.