AP: మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసులో త్వరలో మాజీ మంత్రి, అతని కుమారుడు అరెస్ట్ అవుతారని వాసంశెట్టి చెప్పారు. వారి అవినీతిని బయటపెడతామని అన్నారు. తాను భూకబ్జాకు పాల్పడ్డానని కొంత మంది రామచంద్రాపురంలో ధర్నా చేశారని.. ఆధారాలు ఉంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. నేడు అమలాపురంలో ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.