బాపట్ల: సిబ్బంది సమయపాలన పాటించాలి: కమిషనర్ రఘునాధ రెడ్డి
బాపట్ల పట్టణంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి వార్డు సచివాలయాలను ఆకస్మిక చేశారు. పట్టణములోని 13 , 16 , 18 సచివాలయాలలో హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని హెచ్చరించారు. సచివాలయాలకు వచ్చే ప్రజా ఫిర్యాదులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి కార్యాలయానికి పంపాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సిబ్బంది విధిగా పనిచేయాలన్నారు