

బాపట్ల: విజ్ఞాన శాస్త్ర యాత్రను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
బాపట్ల జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు విజ్ఞానశాస్త్ర యాత్ర ను గురువారం బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ప్రారంభించారు. విజ్ఞాన విహారయాత్రలు విద్యార్థుల పాఠశాలలో కార్యక్రమాలకు భిన్నంగా వినోదాన్ని కలిగిస్తాయన్నారు. జిల్లాలోని 110 మంది విద్యార్థులు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. తిరుపతి, చెన్నైలోని ప్రాంతీయ విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను సందర్శిస్తారన్నారు.