స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే
దుర్గి మండలంలోని ముటుకూరు గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛత హి సేవా కార్యక్రమానికి మంగళవారం ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి విచ్చేశారు. అలాగే పరిసరాల పరిశుభ్రత గురించి తెలియజేస్తూ.. ముటుకూరు గ్రామంలో ర్యాలీని నిర్వహించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గలోని ప్రజలందరికీ పరిసరాల పరిశుభ్రత గురించి తెలియజేస్తూ స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలను నిర్వహించడం మంచి విషయమని తెలియజేశారు.