బాలీవుడ్ నటి మలైకా అరోరాపై ముంబైలోని మెజిస్ట్రేట్ కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2012లో నటుడు సైఫ్ అలీ ఖాన్, మలైకా అరోరా, కరీనా కలిసి భోజనం చేయడానికి ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ మరో కస్టమర్‌తో గొడవ జరగగా అతడిపై సైఫ్ దాడి చేశారు. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో సాక్షిగా ఉన్న మలైకా విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు రెండోసారి బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.