గురజాల: మీ ఇంటి బాధ్యత మేం తీసుకుంటాం: డీఎస్పీ

84చూసినవారు
పండుగలకు, ఫంక్షన్లకు వెళ్లేవారు ముందుగా సమాచారం ఇస్తే వారి ఇళ్లకు సీసీ కెమెరాలు బిగించి ఉచితంగా భద్రత కల్పిస్తామని గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. గురజాల నియోజకవర్గ పరిధిలో పలు దొంగతనాలు జరిగిన నేపథ్యంలో బుధవారం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో కానీ, లేదా ఆయా గ్రామాలలోని మహిళా పోలీసులకు సమాచారం ఇచ్చిన వారికి స్పందించి ఇళ్లకు భద్రత ఏర్పాటు చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you