వరద పరిస్థితి పై రేపు యరపతినేని సమీక్ష
గురజాల నియోజకవర్గంలో వరద పరిస్థితిపై ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురువారం అధికారులతో సమీక్షిస్తారని పార్టీ కార్యాలయం బుధవారం తెలిపింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పిడుగురాళ్ల ఆర్ అండ్ బి బంగ్లాలో సమీక్ష ఉంటుందని పేర్కొంది. ఆర్డిఓ, తహశీల్దారులు, పోలీస్ అధికారులు, సంబంధిత ప్రభుత్వ అధికారులతో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష ఉంటుందని తెలిపింది.