కాకుమాను పిఆర్ ఏఈగా రవీంద్రారెడ్డి నియామకం
గుంటూరు జిల్లా కాకుమాను మండలం పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ గా రవీంద్రారెడ్డి సోమవారం కార్యాలయంలో నూతన పదవీ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా స్పెషల్ ఏఈగా విధులు నిర్వహిస్తూ ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా కాకుమాను మండలానికి బదిలీ అయినట్లు ఆయన మీడియాకు తెలిపారు. మండలంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో అభివృద్ధి పనులకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.