అదానీతో జగన్‌ చేసుకున్న అక్రమ డీల్‌పై దర్యాప్తు చేయాలి: సీఎంకు షర్మిల లేఖ

50చూసినవారు
అదానీతో జగన్‌ చేసుకున్న అక్రమ డీల్‌పై దర్యాప్తు చేయాలి: సీఎంకు షర్మిల లేఖ
గౌతమ్ అదానీతో మాజీ సీఎం వైఎస్ జగన్‌ చేసుకున్న విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలను రద్దు చేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆమె లేఖ రాశారు. "అదానీతో అక్రమ డీల్‌ కారణంగా 25ఏళ్ల పాటు ప్రజలపై రూ.లక్షన్నర కోట్ల భారం పడుతుంది. అర్ధరాత్రి అనుమతుల వెనుక దర్యాప్తు జరగాలి. ఒప్పందాలను రద్దు చేసి, ఆ కంపెనీని వెంటనే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి" అని లేఖలో షర్మిల కోరారు.

సంబంధిత పోస్ట్