గోధుమల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఫైబర్, ప్రోటీన్లు, బి విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల గోధుమలను తింటే మనకు పోషణ లభిస్తుంది. అయితే వీటిని మరీ ఎక్కువగా తింటే బరువు అధికంగా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక గోధుమలను చపాతీలు లేదా రవ్వ ఎలాగైనా సరే తక్కువ మోతాదులో తినాలని నిపుణులు సూచిస్తున్నారు.