Feb 04, 2025, 13:02 IST/
40 ఏళ్ల కల నేడు సాకారం అవుతోంది: మంత్రి దామోదర
Feb 04, 2025, 13:02 IST
సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ.. 30, 40 ఏళ్ల కల నేడు సాకారం అవుతోందని ఆనందం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల ఉద్యమానికి నేడు పరిష్కారం దొరికిందని తెలిపారు. SC వర్గీకరణ వల్ల కొందరిలో భయం, అభద్రతాభావం కలుగుతోందని అన్నారు. వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని.. వర్గీకరణ వల్ల ఎవరి ప్రయోజనాలకు ఇబ్బంది కలగదని మంత్రి భరోసా నిచ్చారు.