BREAKING: బిగ్ బాస్-8 విజేతగా నిఖిల్
బిగ్ బాస్ సీజన్-8 (తెలుగు) విన్నర్‌గా టాప్-5లో ఉన్న కంటెస్టెంట్ నిఖిల్ మలయక్కల్ గెలిచారు. రన్నరప్‌గా గౌతమ్ నిలిచారు. హోస్ట్ నాగార్జున నిఖిల్‌ని విన్నర్‌గా ప్రకటించారు. ఫైనలిస్ట్‌లుగా నిలిచిన వారిలో అవినాష్, ప్రేరణ, నబీల్ ఎలిమినేట్ అయ్యారు. మొదట అవినాష్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ప్రేరణ, నబీల్ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.