గృహాలు కోల్పోయిన రెండు బాధిత కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ లక్ష రూపాయలు ఆర్థికసాయం చేశారు. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయనకు సీతారామపురానికి చెందిన మైలవరపు లోవలక్ష్మి, కాశీవారిపాకలకు చెందిన వాసంశెట్టి శ్రీలక్ష్మిలు కలిసి గుర్తు తెలియని వ్యక్తులు తమ గృహాలను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ పరిహారాన్ని బుధవారం వైకాపా ఇన్ ఛార్జి వంగా గీత పిఠాపురంలో తన పార్టీ కార్యాలయం వద్ద వారికి అందజేశారు.