తల్లి కారును 30 నిమిషాల పాటు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి స్టోర్‌లో షాపింగ్ చేసిన 8 ఏళ్ల బాలిక

84చూసినవారు
తల్లి కారును 30 నిమిషాల పాటు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి స్టోర్‌లో షాపింగ్ చేసిన 8 ఏళ్ల బాలిక
అమెరికా ఓహియోలోని ఓ స్టోర్‌కు వెళ్లేందుకు 8 ఏళ్ల బాలిక రద్దీగా ఉండే రోడ్లపై దాదాపు 30 నిమిషాల పాటు తన తల్లి కారును డ్రైవ్ చేసింది. ఒంటరిగా వెళ్లిన ఆమె ఆ తర్వాత షాపింగ్ చేస్తూ కనిపించింది. తన కుమార్తె తప్పిపోయిందని సదరు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఓ బాలిక కారు, నడిపినట్లు గుర్తించిన పోలీసులు, ఆమె ఆచూకీని గుర్తించారు. అనంతరం సదరు బాలిక కుటుంబ సభ్యులను స్టోర్‌కు పిలిపించారు.

సంబంధిత పోస్ట్