నగర పంచాయతీ పరిధిలో దీర్ఘకాలంగా నెలకొన్న అంధకార పరిస్థితులు తొలగి వెలుగులు ప్రసరిస్తున్నాయి. 450 ఎల్ఈడీ దీపాలను కొనుగోలుచేసి వాటిని ఏర్పాటుచేసే పనులను బుధవారం స్థానిక జగనన్న కాలనీలో నగర పంచాయతీ కమిషనర్ రవికుమార్ ప్రారంభించారు. ఏలేరు వరద ముంపు పరిశీలించేందుకు వచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు స్థానిక జగనన్నకాలనీవాసులు వీధి దీపాలు వెలగక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు విన్నవించారు.