మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలపై కేసు
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలపై బుధవారం కేసు నమోదయింది. 'జై హనుమాన్' చిత్ర నిర్మాతలపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాది తిరుమల్ రావు ఫిర్యాదు చేశారు. హనుమంతుని ముఖ చిత్రం బదులు రిషబ్ శెట్టి మొహాన్ని చూపించారని. భవిష్యత్ తరాలకు హనుమంతుడు ఎవరో గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమా టీజర్లో హనుమంతుని కించపరిచేలా సీన్స్ ఉన్నాయని న్యాయవాది తిరుమల్ రావు తన ఫిర్యాదులో తెలిపారు.