ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయే రోజు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. "ఈ రోజు మన రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయే రోజు. ప్రధాని మోదీ చేతులు మీదుగా రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్ట్ లకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విశాఖ ప్రజల చిరకాల కోరిక, విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభం అయ్యాయి." అని పేర్కొన్నారు.