MPపై దాడి.. క్లారిటీ ఇచ్చిన రాహుల్ గాంధీ (వీడియో)
బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అవును ఎంపీని నేనే తోశాను’ అని రాహుల్ అన్నారు. ‘పార్లమెంట్ లోపలికి వెళ్తున్న నన్ను బీజేపీ ఎంపీలు ఆపడానికి ప్రయత్నించారు, నాపై బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో నెట్టడంతో ఇలా జరిగింది. పార్లమెంట్ లోపలికి వెళ్లే హక్కు మాకుంది’ అని రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు.