పార్లమెంటు ఆవరణలో గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీ నిరసనకు దిగారు. అంబేడ్కర్‌ను అవమానించారంటూ పరస్పర విమర్శలు చేసుకున్నారు. పార్లమెంటు లోపలికి వెళ్తున్న ఎంపీలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగికి గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను రాహుల్ గాంధీ నెట్టారని అధికార పక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు.