షర్మిలకు చెక్.. జగన్ సంచలన వ్యూహం!

55చూసినవారు
షర్మిలకు చెక్.. జగన్ సంచలన వ్యూహం!
AP: వైసీపీ అధినేత జగన్ ను.. కీలక నేతల వలసలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. చెల్లి షర్మిల అన్న జగన్ పై నిత్యం విమర్శలు గుప్పిస్తూ పంటి కింద రాయిలా మారారు. ఈ నేపథ్యంలో చెల్లికి చెక్ పెట్టేందుకు జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిలపై అసంతృప్తిగా ఉన్న ఏపీ కాంగ్రెస్ లోని సీనియర్ నేతలపై ఆయన ఫోకస్ పెట్టారు. వారి లిస్ట్ ను జగన్ తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు 10 మంది నేతలను ఒకే సారి పార్టీలో చేర్చుకుని కేడర్ లో జోష్ తీసుకురావాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్