పెదపూడి: దోమడలో ఇంటింటికి వెళ్లి టీడీపీ సభ్యత్వాలు నమోదు
పెదపూడి మండలం దోమడ గ్రామంలో అనపర్తి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆదేశాలు మేరకు టీడీపీ గ్రామశాఖ అధ్యక్షులు కాకర్ల గోవింద్ ఆధ్వర్యంలో శుక్రవారం సవరపు చిట్టిబాబు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలను నమోదు చేశారు. దీనివల్ల టిడిపి సభ్యత్వాలను ఆన్లైన్ ద్వారా కార్డులు అందజేయబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సభ్యత్వాల ఇన్సూరెన్స్ గురించి ప్రజలకు వివరించారు.