
జూన్ 6 నుంచి గోపాలస్వామి కల్యాణోత్సవాలు
ఆత్రేయపురం మండలం ర్యాలీ జగన్మోహిని కేశవస్వామి ఆలయ క్షేత్ర పాలకుడు గోపాలస్వామి వార్షిక దివ్య కల్యాణోత్సవాలు జూన్ 6వ తేదీ నుంచి 12 వరకు నిర్వహిస్తున్నట్లు ఈఓ రమణమూర్తి తెలిపారు. జూన్ 6న సాయంత్రం 6 గంటలకు అంకుర్పారణ, ధ్వజారోహణం, స్వామివారి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. స్వామి వారి ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు.