బాణాసంచా దుకాణదారులు నిబంధనలు పాటించాలి - సీఐ సుమంత్
లైసెన్స్ కలిగిన బాణాసంచా దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అనపర్తి సీఐ సుమంత్ సూచించారు. అనపర్తి సీఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాత్కాలిక లైసెన్స్ కలిగి మూడు రోజులపాటు దీపావళి మందు గుండు సామాగ్రి వ్యాపారాలు చేసే వ్యాపారులు ఇసుక, నీళ్లుఉంచాలన్నారు. లైసెన్స్ లేకుండా అక్రమంగా బాణాసంచా తయారు చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.