
అనపర్తి: కోర్టు ఆవరణలో మొక్క నాటిన జడ్జి ప్రసన్న
అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో శుక్రవారం అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి రెడ్డి ప్రసన్నఉసిరి మొక్క నాటారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా కోర్టు ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.