అమరావతిలో రూ.2,791 కోట్లతో అభివృద్ధి పనులు
ఏపీ రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే రూ.2,791.31 కోట్ల విలువ గల పలు అభివృద్ధి పనులకు ఏడీసీ టెండర్లు పిలిచింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 31న సాయంత్రం 4 గంటల వరకు అధికారులు గడువును నిర్దేశించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సాంకేతిక బిడ్లను తెరవనున్నారు. వీటిలో రెండు పాలవాగు, గ్రావిటీ కాలువల పనులు కాగా, మిగిలిన ఆరు రాజధాని నగరంలోని వివిధ ప్రాంతాల్లోని రోడ్లకు సంబంధించినవి.