టీటీడీ జేఈవో బదిలీ

61చూసినవారు
టీటీడీ జేఈవో బదిలీ
AP: తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీరియస్ అయిన ఏపీ ప్రభుత్వం అధికారులపై కొరడా ఝుళిపించింది. ఇప్పటికే ఇద్దరు కీలక అధికారులను సస్పెండ్ చేయగా.. తాజాగా మరో అధికారిపై చర్యలు తీసుకుంది. TTD JEOను బదిలీ చేసింది. తొక్కిసలాటకు జేఈవో గౌతమి నిర్లక్ష్యమే కారణమంటూ.. ఆమెను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనాశాఖలో రిపోర్ట్ చేయాలని పేర్కొంది.
Job Suitcase

Jobs near you