పోలీసుల కస్టడీకి వర్రా రవీంద్రారెడ్డి (వీడియో)
AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పులివెందుల పోలీసులు రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారు. కడప జైలు నుంచి రిమ్స్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. వర్రా రవీంద్రారెడ్డిపై జిల్లాలో 10, రాష్ట్రవ్యాప్తంగా 40 కేసులున్నాయి. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అసభ్యకర పోస్టులు పెట్టినందుకు వర్రా రవీంద్రారెడ్డిపై కేసులు నమోదయ్యాయి.