AP: పల్నాడు జిల్లా నందిగామలో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. అమరావతి వెళ్తున్నామంటూ సత్తెనపల్లి తాలుకాలో ఓ మహిళను ఓ డ్రైవరు తన ఆటోను ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్, మరో వ్యక్తి ఆ మహిళను బెదిరించి రెండు సవర్లు బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు.