ఏపీ డిజిటల్ టెక్నాలజీపై రాష్ట్ర స్థాయి సదస్సు బుధవారం విశాఖలోని వీఎంఆర్‌డీఏలో ప్రారంభమైంది. రెండ్రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘టెక్నాలజీతో పాటు విజన్ కూడా చాలా ముఖ్యం. అప్పుడే లక్ష్యాలను సాధించగలం. విద్యారంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెడుతున్నాం. వచ్చే ఐదేళ్లలో యూనివర్సిటీల ర్యాంకింగ్స్ పెరిగేలా పని చేస్తాం. టైమ్ అండ్ డేట్ రాసుకోండి.’ అని లోకేశ్ అన్నారు.