ప్రకృతి విపత్తు నేపథ్యంలో దాతృత్వం చూపిన ఆర్యవైశ్య సంఘ పెద్దల సేవాభావం ఆదర్శనీయమని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డ మండలం పులిగడ్డ పరిధిలోని వసుమట్ల, రేగులంక గ్రామాల్లో వరద బాధితులకు అవనిగడ్డ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రూ. 40వేలు వ్యయంతో 250 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వారికి వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు.