AP: 30 మంది ప్రాణాలు కాపాడి వీర మరణం పొందిన జవాన్ సుబ్బయ్య అంత్యక్రియలు నేడు పూర్తయ్యాయి. సుబ్బయ్య భార్య స్వగ్రామం అనంతపురం జిల్లా నార్పలలో అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో పూర్తి చేశారు. సుబ్బయ్యకు పోలీసులు, ప్రజలు, కుటుంబీకులు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించి దేశ జెండాను ఆయన భార్యకు అందించారు. ఇక సెలవంటూ సుబ్బయ్య భౌతికకాయానికి సెల్యూట్ చేశారు.