భార్య ఎఫైర్.. అత్త తలనరికి భార్య ప్రియుడికి ఇచ్చాడు!
హర్యానాలోని సోనిపట్‌లో నానురామ్ అనే వ్యక్తి భార్యతో జీవిస్తున్నాడు. భార్య వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, అత్త కూడా సపోర్టు చేస్తోందని భర్త గుర్తించాడు. కోపంతో రగిలిపోయిన ఆ భర్త.. అత్త పీక కోసి చంపి తలను సంచిలో వేసుకొని భార్యతో అఫైర్ పెట్టుకున్న వ్యక్తికి ఇచ్చాడు. అతను ఇంటికెళ్లి కవర్ తెరిచి ప్రేయసి అత్త తలను చూడడంతో షాక్ కు గురై పోలీసులకు చెప్పాడు. అంతకు ముందు భార్యను చంపుదామని భర్త వెళ్లగా.. ఆ భార్య తప్పించుకుంది. పోలీసులు దర్యాప్తు చేసి అసలు విషయం రాబట్టారు.