HYDలోని కిమ్స్ ఆసుపత్రిలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో స్పృహ కోల్పోయిన శ్రీతేజ్‌ను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మృతిచెందిన మహిళ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం. ప్రభుత్వం మాకు పూర్తిస్థాయిలో సహకారం అందించింది. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారు. అర్జున్ తరపున నేను ఆస్పత్రికి వచ్చాను' అని చెప్పారు. కాగా, ఈ ఘటనలో బాలుడి తల్లి రేవతి మృతి చెందిన విషయం తెలిసిందే.