రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు.. స్పందించిన నారాయణ
సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరలు పెంచితే బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహించినట్లేనని అన్నారు. డైరెక్టర్ కోసం హీరోయిన్ రష్మిక పీలింగ్స్ సాంగ్ చేసిందని చెప్పినట్లు గుర్తుచేశారు. అలాంటి మహిళలు ఆత్మాభిమానం చంపుకొని పనిచేస్తున్నారని అన్నారు. రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు కాదు రూ.5 కోట్లు ఇచ్చినా ప్రాణాన్ని తిరిగివ్వలేరని మండిపడ్డారు.