TG: మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసుకెళ్లడానికి వచ్చిన కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామస్తులు బుధవారం అర్థరాత్రి అక్కెం నవీన్, పసుల ప్రసాద్ అనే వ్యక్తులు విద్యుత్ తగిలి అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.