తొక్కిసలాట కాదు.. ఊపిరాడకనే రేవతి మృతి?
TG: ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో పుష్ప-2 ప్రీమియర్స్ సందర్బంగా డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట కారణంగానే రేవతి మరణించిందని, శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లారని అందరూ భావిస్తున్నారు. అయితే వారి శరీరంలో ఎముకలు విరగడం లేదా అవయవాలు దెబ్బతినడం లాంటి ఆనవాళ్లు లేవని వైద్యుల నివేదికలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఎక్కువ సంఖ్యలో అభిమానులు రావడంతో వారికి ఊపిరి అందలేదని పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.