విషాదం.. పురిటినొప్పులతో గర్భిణీ మృతి

76చూసినవారు
విషాదం.. పురిటినొప్పులతో గర్భిణీ మృతి
AP: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో మంగళవారం పురిటినొప్పులతో ఓ గర్భిణీ ప్రాణాలు విడిచింది. ఎస్.రాయవరం మండలం చిన్నగుమ్ముటూరుకు చెందిన దేవి (30), నానాజీది మతాంతర వివాహం. దేవికి మొదటి కాన్పు సాధారణంగానే జరిగింది. రెండో కాన్పు కోసం ఏరియా ఆస్పత్రిలో చేరారు. అయితే రాత్రి ఆమెకు విపరీతమైన నొప్పులు వచ్చాయి. ఆపరేషన్ చేయమని చెప్పినా వైద్యులు పట్టించుకోలేదు. దాంతో కడుపులో బిడ్డతో సహా గర్భిణీ మరణించారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితులు ఆందోళనకు దిగారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్