వరద బాధితులు సహాయార్థం పెడన నియోజకవర్గం ముంజులూరు జన సైనికులు రూ. 50 వేల నూతన వస్త్రాలు, 40 బస్తాల వాటర్ ప్యాకెట్లు పంపిణీ నిమిత్తం విజయవాడకు శుక్రవారం ట్రాక్టర్ లో పంపించారు. ఎన్డీఏ కూటమి శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ జెండా ఈ కార్యక్రమం ప్రారంభించారు. జన సైనికుల దాతృత్వం ఎనలేనిదని, దాతల ముందుకు వచ్చి వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.