TG: అల్లు అర్జున్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా, విడుదల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పూచీకత్తు బాండ్లు తీసుకుని న్యాయవాదులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నప్పటికీ.. కొన్ని గంటల నుంచి విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ఈ రాత్రికి అల్లు అర్జున్ జైల్లోనే ఉండే అవకాశముంది. విడుదల ప్రక్రియలో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అల్లు అరవింద్ చంచల్‌గూడ జైలు వద్ద నుంచి ఆయన నివాసానికి వెళ్లిపోయారు. బన్నీని చూసేందుకు అభిమానులు భారీగా చేరుకున్నారు.