సంధ్య థియేటర్ ఘటన కేసులో సినీ హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. తదనంతరం 14 రోజుల రిమాండ్, చంచల్‌గూడ జైలుకు తరలింపు, మధ్యంతర బెయిల్ మంజూరు వంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాగా, తనను పోలీసు కారులో చంచల్‌గూడ జైలుకు తరలించే సమయంలో బన్నీ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ఆయన బావోద్వేగానికి గురైనట్లున్న వీడియో వైరల్ అవుతోంది.