ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలి
వరద సహాయక చర్యల్లో ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. కంకిపాడు మండలం ఉప్పులూరు వద్ద బుడమేరు నీటి ప్రవాహాన్ని ఆదివారం జిల్లా ఎస్పీ గంగాధర రావుతో కలిసి పరిశీలించారు. బుడమేరు నీటి ప్రవాహం యొక్క ఉధృతిని, అధికారులు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఉప్పులూరు గన్నవరం రహదారిని పూర్తిగా మూసివేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.