మున్సిపాలిటీల్లో పన్నుల బకాయిలు వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం విజయవాడ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష చేశారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పన్నుల వసూలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.