విజయవాడ: టిడిపి కార్యకర్తలను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు
జోగి రమేష్ లాంటి మానసిక రోగులను ఎంతమందిని వైసీపీ పావులుగా వాడిన టీడీపీ కార్యకర్తలను విచ్ఛిన్నం చేయలేరని టీడీపీ నాయకులు బెజవాడ నజీర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలోనే ఏ పార్టీలకి లేనటువంటి నిబద్దత, ఆదరణ, కలిగిన కార్యకర్తలు టీడీపీకి మాత్రమే ఉన్నారన్న విషయం జగన్ కూడా బాగా తెలుసన్నారు. ఆ పార్టీపై కార్యకర్తల్లో విషాన్ని నింపడానికి పెద్ద ఎత్తున కుట్ర పన్నిందనడానికి నూజివీడు ఘటనే సాక్ష్యమని పేర్కొన్నారు.