గంపలగూడెం: వైభవంగా ముగిసిన చండీ హోమం
గంపలగూడెం మండలం పెనుగొలను శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో.. దసరా ఉత్సవాల్లో మూడు రోజుల నుంచి జరుగుతున్న చండీ హోమం మంగళవారం వైభవంగా ముగిసింది. చండి ఉపాసకులు ప్రవీణ్ శర్మ వేదమంత్రాలు పారాయణం చేస్తూ హోమగుండంలో మహా పూర్ణాహుతి సమర్పించారు. ఆలయంలో ఉన్న శ్రీ పార్వతి దేవికి శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు రామలింగేశ్వర శర్మ కుంకుమ పూజలు, రుద్రాభిషేకం నిర్వహించారు.